సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఒక ప్రక్క ఎండలు మండిపోతున్నాయి. అయినప్పటికీ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచే జూనియర్ కాలేజీలు పునః ప్రారంభంకానున్నాయి. ఇంటర్ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మొదలైన వేసవి సెలవులు మే 31వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం జూన్ 1వ తేదీ నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ తరగతులు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని ఇంటర్ బోర్డును కొత్త విద్యా సంవత్సరం క్యాలెండర్లను సైతం జారీ చేశారు.
