సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుసగా 4వసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ( Narendra Modi) కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ‘ద్రవ్యోల్బణ సూత్రధారి’ అంటూ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను నెమ్మదిగా పెంచుతూ ప్రజల జేబులను నిశ్శబ్దంగా ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు.కొన్ని నెలల క్రితమే దేశంలో ఆర్థిక తుఫాను రాబోతోందని తాను ముందుగానే హెచ్చరించానని.. కానీ అప్పుడు ప్రధాని మోదీ మాత్రం ఎన్నికలలో రాజకీయా ఎత్తులతో బిజీగా ఉన్నారని సెటైర్లు వేశారు.. ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్ ధరలను రూ.8ల వరకు పెంచారని, ఈ ధరల పెంపు ఇక్కడితో ఆగదని, ఇంకా కొనసాగుతుందని విమర్శించారు. . ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, మిగతా సమయంలో ప్రజల జేబులపై దాడి చేయడం మోదీ ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *