సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి పుష్కరాల-2027 ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో నేడు,సోమవారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనులు ఎలా జరుగుతున్నాయని అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు. ఈసారి గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, అందుకు తగిన విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు, అధికారుల పనితీరుపై డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది వ్యవధిలో రూ.8,600 కోట్లతో చేపట్టాల్సిన పనులకు ఇంకా డీపీఆర్‌లు ఎందుకు సిద్ధం కాలేదని ప్రశ్నించారు. ఒకే సంవత్సరంలో 7 వేల పనులను ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. ఆఖరులో… ఇష్టానుసారంగా ఖర్చు పెడదామని అనుకుంటే కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావిడిగా పాచిపోయిన సిమెంట్‌తో పనులు చేస్తే అవి కూలిపోతాయని హెచ్చరించారు. గత పుష్కరాల్లో జరిగిన సీఎం చంద్రబాబు రాకతో తొక్కిసలాటలో 30 మంది మరణించిన ఘటన గుర్తు చేస్తూ ఇటువంటి వంటి ఘటనలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
