సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) కు జేసిఏ నాయకులు నేడు మంగళవారం ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రాన్ని అందించారు. ఏపీ ఎన్జీవో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యు వి పాండు రంగారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ హరిప్రసాద్ బాబు మాట్లాడుతూ.. పిఆర్ సి కమిషన్ తక్షణం నియమించాలని, తాత్కాలిక భృతి, ఐఆర్ ఇవ్వాలని కోరారు. వీటితో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించామన్నారు. జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు, పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *