సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా నేడు, బుధవారం మరల ఇరాన్ అమెరికా ల మధ్య యుద్ధం మొదలయింది. ఇరాన్‌తో కుదుర్చుకున్న తాత్కాలిక అవగాహన ఒప్పందం(MoU) కథ ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వారు నీచులు. నీచులు అంటే ఏంటో మీకు తెలుసా? మానసిక రోగులు. వారిని నడిపించే నాయకులు కూడా మానసిక రోగులే. వారి వద్ద అణుబాంబు ఉంటె వెంటనే వేసేస్తారు.. నావరకు వారితో చర్చలు వ్యర్థం.. అయితే.. ప్రస్తుతానికి చర్చలు కొనసాగించడానికి మాత్రం అనుమతిస్తానని ఆయన పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడిందన్న ఆరోపణలతో.. ఇరాన్‌కు చెందిన రేవు పట్టణాలైన బందర్ అబ్బాస్, సిరిక్, అలాగే కెస్మ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా భారీ వైమానిక దాడులు జరిపిన కొద్ది గంటల్లోనే ఇరాన్ చమురు విక్రయాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మినహాయింపు లైసెన్స్‌ను కూడా వాషింగ్టన్ రద్దు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ మిసైల్స్ డ్రోన్లతో బహ్రెయిన్, కువైట్‌లలోని సుమారు 70 అమెరికా సైనిక క్యాంప్ బేస్ ఎదురుదాడులకు దిగి బాంబుల వర్షము కురిపించింది.
