సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా-ఇరాన్ మధ్య మరల చెల రేగిన యుద్ధ వాతావరణం, పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బతీశాయి. భారత స్టాక్ మార్కెట్లు నేడు బుధవారం ఒక్కరోజులో రూ. 8.4 లక్షల కోట్ల తీవ్ర నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,765 పాయింట్లకు పైగా (2.26%) కుప్పకూలింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోయి ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు(Crude Oil) ధర ఒక్కసారిగా 78.73 డాలర్లకు చేరుకుంది..దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్, మెటల్ రంగాల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
