సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు . ఫు క్వాక్ ద్వీప సమూహంలోని ఆన్తోయ్ సమీపంలోని హోన్ మే రూట్ పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది భారతీయ పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం. వారిలో మన తెలుగువారు మంచిలిపట్నం కు చెందిన ఒక కుటుంబం ఉన్నట్లు మరియు పారిశ్రామిక వేత్త కిషోర్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు, కడపకు చెందిన సెల్ ఫోన్ డీలర్ శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందింది. పలువురు గల్లంతవగా.. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ప్రమాదం జరిగిన సమయంలో బోటులో మొత్తం 32 మంది భారతీయులు ప్రయాణిస్తున్నట్లు వియత్నాం అధికారులు తెలిపారు.. ప్రమాదం అనంతరం వియత్నాం కోస్ట్ గార్డ్, స్థానిక రెస్క్యూ బృందాలు వేగంగా సహాయక చర్యలు చేపట్టి 21 మందిని సురక్షితంగా రక్షించాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
