సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నంలో నేది ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించింది. పలు అపార్ట్మెంట్ లలో కాస్త అలజడి రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. రిక్టర్ స్కేల్‌పై దాని ప్రభావం 4.5గా నమోదైంది. ఉదయం 5:08 గంటలకు భూమి కంపించినట్లు సమాచారం. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, ప్రస్తుత భూకంప ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదని సమాచారం.
