సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ ఆటోనగర్‌లో నేడు, ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మెకానిక్ షెడ్డులో పలు ప్రైవేట్ ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సులు కు పూర్తీ పిట్ నెస్ కోసం మరమ్మతులు చేస్తున్న సమయంలో అందులో ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి అది మరో 6 బస్సులకు పాకిపోయి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు బస్సులు దగ్ధమయినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మూడు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. అయితే ఆటో నగర్ వాసులు భారీ అగ్ని ప్రమాదంతో ఆందోళనకు గురి అయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *