సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగేందుకు కొన్ని డూప్లికేట్ లేదా మరణించిన వారి ఓట్లతో పాటు అక్రమంగా నమోదైన వారి ఓట్లను తొలగించడం అత్యంత ఆవశ్యకమని ప్రజలు సహకరించాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు భీమవరంలోని జిల్లా బిజెపి కార్యాలయం వద్ద నేడు, ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన 25 ప్రచార ఆటోలను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ఆటోను నడిపి ప్రచార కార్యక్రమానికి ఉత్సాహంగా శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రి స్వయంగా ఆటో నడపడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
