సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నా అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఈ క్రేజీ మాస్ యాక్షన్ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. నేడు, ఆదివారం కూడా కలిపితే అవలీలగా 50 కోట్లకు పైగా కలెక్షన్ నమోదు కానున్నది. అఖిల్ కెరీర్ లో లెనిన్ భారీ హిట్ సాధించినట్లే .. 100 కోట్ల క్లబ్ లో చేరటం ఖాయంగా కనపడుతుంది. అంతకుముందు మొదటి రోజే రూ. 16.7 కోట్ల గ్రాస్ సాధించి అఖిల్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. అసలే ఇటీవల తెలుగు సినీ ఇండస్ట్రీ కి సరైన హిట్ లేక థియేటర్స్ బోసిపోతున్న నేపథ్యంలో లెనిన్ తో ప్రేక్షకుల కళ కళలు ఈ నెలరోజులు కొనసాగుతాయి. భీమవరం లో మొదటి రోజు 2 థియేటర్స్ లో రిలీజ్ అయిన లెనిన్ నేడు, ఆదివారం 4 థియేటర్స్ కు పెంచారు. మూడు రోజులకు 15 లక్షల గ్రాస్ కలెక్షన్ అధిగమించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *