సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 15న భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటనకు అనేక ప్రభుత్వం పరోక్షంగా అడ్డంకులు సృష్టింస్తుందని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం జగన్ కు భీమవరం లో హెలిప్యాడ్ కు అనుమతి ఇవ్వకపోయిన, ఎన్ని అడ్డంకులు పెట్టిన, అయన రాకపై అనుమానాలు వ్యక్తం చేసిన సరే.. జగన్ భీమవరం పర్యటన ఈనెల 15న జరుగుతుందని, ఆయన కారు లేదా రైలు మార్గం ద్వారా భీమవరం చేరుకొని ఇక్కడ గోదావరి జిల్లాల ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు, సిండికేట్స్ తో జరుగుతున్నా దోపిడీ ని సమీక్షించి తదుపరి ప్రభుత్వంను డిమాండ్ చెయ్యడానికి కార్యాచరణలో దిగుతారని , కచ్చితంగా వేల కోట్ల రూపాయల విలువైన రొయ్య చేపల ఎగుమతులు చేస్తున్న ఈ భీమవరం జోన్ ఆక్వా రైతులకు జగన్ రాకతో మేలు జరుగుతుందని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, చినమిల్లి వెంకట రాయుడు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ఇతర వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఇప్పటికే భీమవరం పట్టణం అంతటా జగన్ ను ఆహ్వానిస్తూ భారీగా ప్లెక్సీ స్వాగత బ్యానర్స్ సిద్ధం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *