సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానంలో పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం(One-time option) ఇస్తూ ఆర్థిక శాఖ నేడు, సోమవారం జీవో ఎంఎస్ నెం.53ను(G.O.MS.No. 53) విడుదల చేసింది. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చి, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారు అర్హులుగా ఉండనున్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, జీవో జారీ అయిన తేదీ నుంచి మూడు నెలల లోపు అర్హులైన ఉద్యోగులు తమ ఆప్షన్‌ను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
