సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ సీనియర్ నేత ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి (PCC) అధ్యక్షుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ప్రముఖ పారిశ్రామిక వేత్త,, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు గారు ఇటీవల మరణించిన నేపథ్యంలో నేడు, సోమవారం రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్య మోషేను రాజు పెద్దేవం లోని వారి నివాసానికి వెళ్లి స్వర్గీయ జిఎస్ రావు ఫొటోకు నివాళ్లు అర్పించి అయన కుమారుడు వైసీపీ నేత నిడదవోలు మాజీ శాసన సభ్యులు G. శ్రీనివాస నాయుడు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. స్వర్గీయ జిఎస్ రావు తో తనకున్న సుదీర్ఘ అనుబంధం గుర్తుకు తెచ్చుకొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు భీమవరం నేతలు కూడా వెళ్లి మాజీ ఎమ్మెల్యే G. శ్రీనివాస నాయుడు ను పరామర్శిస్తున్నారు.
