సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వైసీపీ పార్టీకి కీలక నేత, భీమవరం మండల ఎంపీపీ పేరిచర్ల నరసింహరాజు తల్లి కృష్ణవేణి ఇటీవల మరణించిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పెదగరువు గ్రామంలో ఎంపీపీ పెరిచర్ల నరసింహరాజు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహరాజు తల్లి కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతిని తెలియజేశారు.
