సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మరల ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. ట్రంప్ ను చంపుతామని ఇరాన్ శపధం చేసిన నేపథ్యంలో..ఇరాన్ ఫై 1000 మిస్సెల్స్ దాడి ఉంటుందని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4 శాతం పెరిగి 79 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.74 కి ఎగబాకింది. , గత సెషన్ ముగింపు (77,569)తో పోల్చుకుంటే నేటి సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల బాటలో చివరికి నేటి సాయంత్రానికి 47 పాయింట్స్ తో ముగియడంతో మదుపరులు ఊపిరి తీసుకొన్నారు. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 98 పాయింట్ల నష్టంతో 24,108 వద్ద ప్రారంభం అయి చివరకు కేవలం 4 పాయింట్స్ స్వల్ప లాభం తో బయట పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *