సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు శుక్రవారం అంటే ఈనెల 17న ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని చేపడుతుందని, దీనిలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో 4వ ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈనెల 17న భీమవరం మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అంజిబాబు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందని, ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకుని రావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *