సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం అత్యంత ప్రతిష్టాకరంగా 10 లక్షల మంది పైగా భక్తుల సమక్షంలో శోభాయమానంగా జరుగుతున్నా జరుగుతున్నా పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా గ్రాండ్ రోడ్డులో రద్దీని తట్టుకోలేక కొందరు భక్తులు అస్వస్థతకు లోనయ్యారు. రద్దీ విపరీతంగా పెరిగి తొక్కిసలాట జరగటంతో అనేక మంది ఊపిరాడక అవస్థ పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఎమర్జెన్సీ సిబ్బంది బాధితులను పూరీ మెడికల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఊపిరాడక ఒక వ్యక్తి మరణించినట్లు తెలిసింది. వెంటనే ఆ వ్యక్తిని పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించినట్టు సమాచారం.. అస్వస్థతకు లోనైన సుమారు 120 మందిని ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
