సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గలోని పేద ప్రజలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి శాస్త్ర చికిత్సకు ముందుగానే కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ కుటమీ ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేశారని భీమవరం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం మండలం గుట్లపాడు గ్రామానికి చెందిన రేవు స్వాతి రాణి హేమంత్ కుమార్ లకు చెందిన మూడు రోజుల శిశువు ఆరోగ్య చికిత్సకు 1 లక్ష 48 వేల రూపాయలు మరియు నాగిడిపాలెం గ్రామానికి చెందిన నాగిడి వెంకటేశ్వర్లు కాళ్ల శాస్త్ర చికిత్సకు 2 లక్షల 50 వేల రూపాయలను వైద్య చికిత్స సీఎం సహాయనిధి నుండి ఎల్ఓసి ద్వారా ఆర్థిక సహాయాన్ని తోట సీతారామలక్ష్మి భీమవరం నియోజవర్గ టిడిపి కార్యాలయంలో వారికి నేడు, శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల టిడిపి అధ్యక్షడు కోయ్యలగడ్డ గణపతి, టిడిపి నాయకులు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్ బొడ్డు మోహన్ రేవు వెంకన్న కోళ్ల నాగబాబు జవ్వాది గణేష్ సంబంధిత గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.
