సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం రాజ్యసభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చ జరగగా వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా .. నీట్ తరహాకు మించి ఏపీలో డీఎస్సీ పేపర్ లీక్ జరిగిందని లక్షలాది మంది నిరుద్యోగులు పాల్గొన్న ఈ పరీక్షలలో ఉద్యోగుల ఎంపికలో కూడా స్పోర్ట్ కోటాలో పెద్ద ఎత్తున స్కాం జరిగిందని ప్రస్తావించగా ఇదే సమయంలో టీడీపీ ఎంపీ సానా సతీశ్‌ తీవ్ర అభ్యన్తరం తెలుపుతూ వైవీ సుబ్బారెడ్డి ప్రసంగాన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో సభా అధ్యక్ష స్థానంలో ఉన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌.. వైవీని అడ్డుకున్నారు. ఇది జాతీయ స్థాయికి సంబంధించిన పేపర్‌ లీక్‌ బిల్లు అని, దీనిపై మాత్రమే మాట్లాడాలని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ బిల్లుకు సంబంధం లేకుండా మాట్లాడిన అంశాలను రికార్డుల్లోకి తీసుకోబోమని డిప్యూటీ చైర్మన్‌ చెప్పారు. అయినప్పటికీ ఏపీలో డీఎస్సీ పేపర్ లీక్ అంశం పైనే మాట్లాడుతూ సిబిఐ దర్యాప్తు కు డిమాండ్ చేస్తూ సభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *