సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలోని చింతూరు మండలం బొడుగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం నేడు, శనివారం ఉదయం జరిగింది. ఒడిశా నుంచి తమిళనాడుకు ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీని వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొట్టింది. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్పాట్ లో సజీవదహనం అయ్యి ప్రాణాలు కోల్పోయారు.
