సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే (ఆగస్టు 22) నేపథ్యంలో ఆయన అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తోన్న మెగా 158 టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. వాల్తేర్ వీరయ్య వంటి సూపర్ మెగా హిట్ ఇచ్చిన దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా Mega 158 నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు నిర్మాతలు.. గతంలో ఊహించినట్లుగానే మెగా 158 సినిమాకు ‘కాకా’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇదే సందర్భంగా ఓ పవర్ ఫుల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న కాకా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక సుమారు 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ గ్లింప్స్ లో చిరంజీవి చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. మాఫియా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళం హీరోయిన్ అనస్వరరాజన్ తో పాటు ప్రియమణి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *