సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్‌లో ఇటీవల ఏపీలో జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు దాటుతున్న ఓ యువతిని వేగం నియంత్రించలేక కారుతో డీ కొట్టడంతో ఆమె మరణించిన ఘటన సోషల్ మీడియాలో బాగా హాల్ చేస్తుంది. ఎట్టకేలకు ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ లు ఎంపీ కుమారుడిపై కేసు నమోదు చేసారు,, ఈ పరిణామాలు ఫై ఎంపీ లింగమనేని రమేష్ స్పందించారు. ప్రమాదంలో యువతి మృతి చెందడం తీవ్ర విషాదకరమని.. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కేసులో తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదని, చట్టపరమైన ప్రక్రియల నుంచి తన కుమారుడిని తప్పించుకునే ఉద్దేశం లేదని.. పోలీసులకు తమ కుమారుడు పూర్తిగా సహకరిస్తాడని తెలిపారు, వివరాలలోకి వెళ్ళితే ఒడిశాకు చెందిన 26 ఏళ్ల భారతి ముఖి ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తు.. తన ఫ్రెండ్‌తో కలిసి లంచ్ తెచ్చుకుని రోడ్డు దాటే క్రమంలో అటుగా వేగంగా వచ్చిన ఓ లగ్జరీ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *