సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో టంగుటూరి విగ్రహ నిర్మాణ కమిటీ, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నేడు, ఆదివారం ప్రకాశం చౌక్ లోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో ఆ మహనీయులు చిరస్మరణీయంగా నిలిచారని, ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శమన్నారు.తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ భీమవరం ప్రకాశం చౌక్ లో ఎంతో మంది దాతలు సహకారంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశామని అన్నారు. అనంతరం విగ్రహ శిల్పి ల ను సత్కరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *