సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ వరల్డ్ లెవెల్లో భారీ హైప్‌తో’ యాష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్తా ఊహించని వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ శివారులోని మల్లారెడ్డి కాలేజీ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో వేలాది కాలేజీ యువత మధ్య ఒక్కసారిగా అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనితో పలువురు సృహతప్పడం తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్థులకు కాళ్ళు చేతులు విరిగిపోవడంతో వారికీ 2 నెలలు పైగా ఆసుపత్రికి అంకితం కావలసిన పరిస్థితి నెలకొంది. ఈ రచ్చపై సీరియస్ అయిన పేట్ బషీరాబాద్ పోలీసులు మూవీ యూనిట్‌తో పాటు మల్లారెడ్డి కాలేజీ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *