సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లో వచ్చే సెప్టెంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు నగరాలలో మునిసిపల్ మేయర్ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నా నేపథ్యంలో .. గత దశాబ్దంగా సరిహద్దు గ్రామాల విలీన పక్రియ ఆగిపోవడంతో భీమవరం నగరం గా మార్చి మేయర్ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కొవ్వాడ, అన్నవరం, చినఅమిరం, తాడేరు, రాయలం 5గ్రామాలు ప్రతినిధులు ఎదురు తిరగటంతో.. కోర్టులో స్టే లను ఉపసంహరించు కోకపోవడంతో ఆ ప్రక్రియకు తాజగా మరోసారి విఘాతం కలిగింది. దీనిని పరిష్కారించాలని తాజగా భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, జిల్లా , తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, మెంటె పార్ధ సారధి, కోళ్ల నాగేశ్వర రావు ,ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి చినబాబు, భీమవరం మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఆ 5 గ్రామాల్లో కేసులు వేసిన ప్రతినిధులతో జరిగిన సమావేశంలో.. భీమవరం నగర అభివృద్ధి కి సహకరించాలని కోర్ట్ లో కేసులను ఉపసంహరించుకోవాలని కోరగా .. 5 గ్రామాలకు 3 గ్రామాలు కొవ్వాడ, అన్నవరం, చినఅమిరం ప్రతినిధులు తమ గ్రామాలు ఇప్పటికే అభివృద్ధిలో ముందున్నామని విలీనం కు ససేమిరా అన్నారు. రాయలం, తాడేరు వారు మిశ్రమంగా స్వాందించారు. అయితే తాజా పరిణామాలు దృష్ట్యా .. ఈసారి అయిన ఎటువంటి మార్పులు లేకుండా ఉన్న 39 వార్డులతో మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తారన్న ఉద్దేశ్యం ఫై కూడా అనుమానాలు కలుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *