సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:గత వైసీపీ పాలన హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయంటు ఆరోపణలు ఫై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అరెస్ట్ చేసిన క్రమంలో కారుమూరికి నేడు, సోమవారం ఉదయం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలోవైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం కారుమూరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే గాంధీ ఆసుపత్రి వద్ద మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తనను రాజకీయ కక్ష తో తప్పుడు ఆరోపణలు తో అరెస్ట్ చేయించారని, నిజానికి ఈడీ పేర్కొంటున్నట్లు తన అకౌంట్లో ఎలాంటి డబ్బులు జమ అవ్వలేదని తెలిపారు. ఈ కేసులో తన కొడుకు సునీల్ ను అరెస్టు చేశారని, తన కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ తెలియదని ఈ కేసులో నిజా నిజాలన్నీ కోర్టులో తేలుతాయని కారుమూరి వెంకట నాగేశ్వరరావు దీమా వ్యక్తం చేసారు.
