సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ను కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, గతంలో ఇచ్చిన హామీలను తుంగలో త్రొక్కిందని తమ హక్కుల సాధనకు, పేరుకొనిపోయిన బకాయిల సాధనకు అందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైౖర్మన్‌ కె.రమేష్‌కుమార్‌, పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్‌ ఐవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. గత ఆదివారం ఏలూరు రెవెన్యూ భవన్‌లో అలాగే భీమవరంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన ర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సమస్యల పరిష్కారంకోసం ఈనెల 28న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో రాష్ట్ర ఛైర్‌పర్సన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగే రాష్ట్ర సదస్సుకు వేలాదిగా తరలిరావాలని పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *