సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రావణ మాసం కావడంతో చికెన్‌కు డిమాండ్ భారీగా తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే భీమవరం మార్కెట్ లో కోడి గుడ్డు కూడా హోల్ సేల్ 30 గుడ్లు ధర ఒక్కసారిగా 160-170 కి దిగివచ్చింది. 2వరాల క్రితం 210 రూపాయలు పలికింది అయితే శ్రావణ మాసం పూర్తయితే కోళ్లకు, గుడ్లకు మళ్లీ డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు.మరల కార్తీక మాసం డిమాండ్ తగ్గనుంది. గత కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ రూ.350 వరకు చేరుకోగా.. శ్రావణ మాసం ప్రారంభమయ్యాక రూ.250కి పడిపోయింది. నాటు కోడి గుడ్లు ధర మాత్రం హోల్ సేల్ లోని ఒక్కటి 20 రూపాయలు పలుకుతుంది.
