సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘స్టార్ మా;ఛానెల్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రియాలిటీ షో,గ్రాండ్ లాంఛింగ్ మరోసారి అక్కినేని నాగార్జున హోస్టుగా నేటి ఆదివారం సాయంత్రం 7 గంటలకు (సెప్టెంబర్ 06) బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అధికారికంగా ప్రారంభం కానుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 గ్రాండ్ కూడా వివాదాల నడుమ మరోసారి సక్సెస్ అయ్యింది. ఇక బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సోషల్ మీడియాలో అయితే చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో 1సీరియల్ నటి దేబ్జానీ మోదక్, 2. చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలో సెకండ్ హీరోగా నటించిన అదిత్ ఈశ్వరన్ 3. సింగర్ ఝాన్సీ- అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్, 4. సుధీర్ రెడ్డి – పోడ్‌కాస్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ 5. అమన్ మసూద్- పాడ్ కాస్టర్, అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు.వీరితో పాటు సీరియల్ నటుడు ముఖేష్ గౌడ అలియాస్ రిషి, రోహిత్ (కామనర్), వినాయకుడు మూవీ హీరో కృష్ణుడు, శాలినీ, జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం , ఆర్జే చరణ్, యాంకర్ వర్షిణీ సౌందర రాజన్, ‘జబర్దస్త్’ నరేష్ , ప్రముఖ సీరియల్ నటి చైత్ర రాయ్ తదితరులు హౌస్ లోకి రానున్నారని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *