సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు, సోమవారం , పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ జెండా, అజెండా ప్రకటించే ముందు ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యలు పరిశీలిస్తానని , ప్రజలలోకి వెళ్లి ఏపీలో మూడవ పార్టీ ప్రత్యమ్నాయం అవసరాన్ని ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన పార్టీలు ప్రధానంగా ఉన్నాయని ప్రస్తావించారు. ఈ పార్టీలన్నీ ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పార్టీలు వారసత్వ రాజకీయాలను ప్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించాయని విమర్శించారు. తన పార్టీలో సీఎం అభ్యర్థిని తాను కాదని , పార్టీకి గతంలో శివసేన కు బాలథాకరే తరహాలో అధినేతగా ఉంటాను కానీ సీఎం అధికారం కోసం కాదని సీఎం అభ్యర్థి ఎవరో పార్టీ పెట్టక తెలియజేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
