సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకితాజగా నేడు, మంగళవారం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,294 పోస్టులను భర్తీచేయగా.. తాజాగా 913 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఆశా కార్యకర్తకు నెలకు గౌరవ వేతనం రూ.10వేలు కాగా. ఈ జీతంలో.. రూ.8,320 రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలింది కేంద్రం అందిస్తుంది. .. 24 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు అర్హులు. జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపినట్లు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ నెల 30వ తేదీలోగా ఈ నియామకాల ప్రక్రియను మొదలు పెడతామన్నారు. ఈ పోస్టులకు సంబంధించి స్వంత వార్డుకు చెందిన మహిళల్లో 10వ తరగతి పాసై ఉండాలి. 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
