సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త వచ్చింది. జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఈ సెప్టెంబర్ నెల 15న ప్రాథమిక (షార్ట్) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గ్రూప్ 1లో తొలుత 149 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే వయోజన విద్య సహాయ సంచాలకులు/ప్రాజెక్టు అధికారి పోస్టులు 4, జిల్లా విద్యాధికారి (DEO) పోస్టులు 14 ఆ జాబితాలో లేవు. వీటిని కూడా కలిపి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉండటంతో గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 167కు చేరే అవకాశం ఉంది. ఇందులో పోస్టుల సంఖ్య, దరఖాస్తుల స్వీకరణ తేదీలు, పరీక్షల షెడ్యూల్ వంటి వివరాలను ప్రకటిస్తారు.. అనంతరం అక్టోబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసి సిలబస్, రిజర్వేషన్ రోస్టర్, ఇతర నిబంధనలను ప్రకటించనున్నారు.
