సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’.గత ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు మైత్రి మూవీస్ అధినేతలు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో ఈ సినిమా రిలీజై 3 వారాలు గడిచిపోయాయి. అయితే థియేటర్లలో ఉండగానే ఇరుముడి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. నేడు ఆదివారం (సెప్టెంబర్ 13) రవితేజ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచే ఇరుముడి సినిమా ఓటీటీలోకి రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇరుముడి సినిమా డబ్బింగ్ లో కూడా చూడవచ్చు.
