సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ‘మీసేవలో’ ప్రభుత్వ సేవలు, పథకాలు పొందడానికి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ అథెంటికేషన్ ఆప్షనల్ మాత్రమేనని.. ఆధార్ ఇవ్వకపోయినా 246 సేవలను నిరాకరించరాదని ఆదేశించింది. లబ్ధిదారులు కేవలం ఆధార్ కార్డు ఇవ్వలేదనే కారణంతో ఎలాంటి ప్రభుత్వ సేవలను నిరాకరించేందుకు వీల్లేదని ప్రభుత్వం తెలిపింది.ఈ-కేవైసీ కోసం ఆధార్ తీసుకునే కారణాలు, వివరాల భద్రతపై స్పష్టత ఇవ్వాలని తెలిపారు. అలాగే ప్రభుత్వ సేవల కోసం ఆధార్‌ను స్వచ్ఛంద ప్రాతిపదికన స్వీకరించాలని పేర్కొంది
