సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఢిల్లీలో అత్యంత సమర్ధవంతంగా నిర్వహించిన బ్రిక్స్ అంతర్జాతీయ సమావేశం భారత్ ఖ్యాతిని అంతర్జాతీయంగా మరింత పెంచింది. దీనిలో 20 కి పైగా దేశాధినేతలతో ఢిల్లీ లో చర్చలు జరిపిన ప్రధాని మోడీ ఇమేజ్ కూడా పెరిగింది. ఈనేపథ్యంలో దేశంలో కొత్త తలనొప్పులు కు దూరంగా ఉండాలని ఎన్డీయే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అసలే వచ్చే 2027 లో 7 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు విధించరాదని బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు ఎక్కువగా చెల్లించే రూ.2 వేల వరకు యూపీఐ చెల్లింపులు, రూపే డెబిట్ కార్డుతో చేసే చెల్లింపులపై చార్జీలు వసూలు చేయడం నిషేధమని తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 సెక్షన్ 10ఏ కింద కేంద్ర ఆర్థిక శాఖ గత సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
