సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయి లో పేలుడు పదార్థాలు తో ఉన్న బ్యాగ్ లభించడం సంచలనం రేపింది. గత సోమవారం రాత్రి .ఉత్తరప్రదేశ్ కి చెందిన అలీ నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో వచ్చాడు. అయితే బస్సులో తన బ్యాగ్‌కు బదులుగా మరో బ్యాగ్‌ ఉండటాన్ని గమనించాడు. అందులో అనుమానాస్పదంగా వస్తువులు కనిపించడంతో బస్‌స్టాండ్‌ అవుట్‌పోస్ట్‌ పోలీసుల దగ్గరకు వెళ్లి సమాచారం అందించారు.పోలీసులుఆ బ్యాగ్ పరిశీలిస్తే.. అందులో 46 జిలెటిన్‌ స్టిక్స్, 50 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు ఉన్నాయి.. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు . ఈ పేలుడు పదార్థాల ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నారు..దీనివెనుక ఎవరి కుట్ర ప్యూహం ఉందొ పోలిసుల విచారణ లో తేలనుంది. up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *