సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెసిడెన్స్ సర్టిఫికేట్‌ (నివాస ధ్రువీకరణపత్రం)కు సంబంధించి స్థానిక తహసీల్దారులుకు ప్రజల నివాస ధ్రువీకరణపత్రాల జారీచేసే అధికారాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై ప్రజలు రెసిడెన్స్ సర్టిపికేట్ తీసుకోవాలంటే తగిన ఆధారాలతో దరఖాస్తుల్ని తహసీల్దారుకు సమర్పించాల్సి ఉంటుంది..ఈ మేరకు జీవో నంబర్ 592ను ప్రభుత్వం జారీ చేసింది. ఉద్యోగాలు, విద్య, ఆధార్ నమోదు, ఓటరు జాబితా సవరణల కోసం ప్రజలకు నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 2015లో జారీ చేసిన జీవో 581ను రద్దు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *