సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మాజీ డిప్యూటీ సీఎం.ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానికి నేడు,గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులర్పించారు. లోకేశ్‌తో పాటు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్,మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి, మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, రోషన్ కుమార్, పలువురు కూటమి నాయకులు.. ఆళ్ల నాని భౌతికకాయానికి నివాళులర్పించారు.మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఆళ్ల నాని మృతి చాలా బాధాకరమన్నారు. రాజకీయాల్లో చాలా హుందాగా వ్యవహరించారని తెలిపారు. వ్యక్తిగత విమర్శలకు ఏనాడూ తావివ్వలేదని.. సమస్యలపై మాత్రమే పోరాటం చేశారని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీపరంగా, ప్రభుత్వపరంగా అండగా ఉంటామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *