సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ మరియు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజగా తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే నెల 6న జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ పేరు, పువ్వులు-గడ్డి గుర్తును ఈసీ తాత్కాలికంగా ఫ్రీజ్ చేయడాన్ని ఆయన విమర్శిస్తూ .నేడు శుక్రవారం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. బీజేపీ వాళ్ళు దేశంలో ‘మొదట ఓట్లను చోరీ చేశారు. తర్వాత ప్రభుత్వాలను చోరీ చేశారు. ఇప్పుడు పార్టీని దొంగిలిస్తున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం దిగజారిపోతోందనడానికి తాజా పరిణామాలు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ ఇలాగే తప్పు జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *