సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. గత గురువారం రాత్రి స్థానిక పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన పంచారామ క్షేత్రంలో ప్రధాని మోడీకి కి దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని, ఆయన నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలిసి ఆలయంలో ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీ విద్యా గణపతి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద దీప కార్యక్రమంలో కూడా వారు పాల్గొన్నారు. నాచువారి సెంటర్లో స్టీల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆశీర్వాద దీప కార్యక్రమాన్ని కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ‘వికసిత్ భారత్ 2047’ నాటికి ఉక్కు రంగంలో 600 మిలియన్ టన్నుల (600 MT) ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా ప్రధాని మోడీ అభివృద్ధి చర్యలు చేపట్టారని కొనియాడారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల సుదీర్ఘ, విజయవంతమైన ప్రజాపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా “సేవా సంకల్ప అభియాన్” పేరుతో నెలరోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
