సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గంలో వాడవాడలా శ్రీ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజులు, పంచమ రాత్రులు పూర్తీ అయ్యిన నేపథ్యంలో నిమజ్జనాలు, భక్తులకు అన్న సమారాధనలు పెద్ద ఎత్తున జారుతున్నాయి. తాజగా భీమవర్మ మండలం రామాయణపురం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా బాల గణేష్ యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు. దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన కార్యక్రమాలను నిర్వహించడం భగవత్ సేవతో సమానమని, యువత ఉత్సవాలను సంప్రదాయ బద్దంగా నిర్వహిస్తున్నారని బాల గణేష్ యూత్ సభ్యులను అభినందించారు.
