సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్టోబర్ 15 నుండి ఈ యు.పి.ఐ చార్జీలను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక జి.ఒని తీసుకు వచ్చింది.దీనిని తక్షణం ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ, భీమవరం ప్రకాశం చౌక్‌సెంటర్‌లో సిపిఎం పార్టీ ఆద్వర్యంలో నిరరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జె.ఎన్.వి గోపాలన్ మాట్లాడుతూ ..అక్టోబర్ 15 నుండి 2000పైన చేసే అన్ని వ్యాపార యు.పి.ఐ పేమెంట్స్‌పై చార్జీలు వసూలు చేయనుంది. దీని వల్ల వినియోగదారులపై విపరీతమైన భారం పడనుందన్నారు. 2016 లో కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేసి మనం అందరం డిజిటల్స్ పేమెంట్స్ అలవర్చుకోవాలని ప్రధాని మోడీ చెప్పడంతో ప్రతి సామాన్యమానవుడుదీన్ని అలవాటు చేసుకున్నాడు. పెద్ద ఎత్తున వాడుతున్నారు. ఒకరోజులో లక్ష కోట్ల రూపాయలు డిజిటల్ లవాదేవీలు జరుగుతున్నాయి. నెలకు 8వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు యు.పి.ఐ పేమెంట్స్‌ద్వారా వసూలు చేయబోతోంది. పోన్ పే, గూగుల్‌పే, వంటి కంపెనీలన్నీ అమెరికావే వసూలు చేసేదంతా అమెరికా కంపెనీలకు వెల్తాయన్నారు. అంటే దేశంలోని ఉన్న ప్రజల లావాదేవీలపై చార్జీల పేరుతొ మరో అదనపు భారం వేసి అమెరికాకు దోచినపెట్టే ఈ జి.ఒ ని ప్రజానీకం అంతా వ్యతిరేకించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *