సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎదో అటు ఇటుగా కాస్త నష్టాలు కొంచెం లాభాలు తో వెళుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరగడంతో నేడు, గురువారం ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, రోజంతా విక్రయాల ఒత్తిడి ఎదుర్కొని చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,247.71 పాయింట్లు (1.67శాతం) కోల్పోయి 73,580.54 దగ్గర ముగిసింది. ఇవాళ సెన్సెక్స్ గరిష్ఠంగా 74,362.29 స్థాయిని, కనిష్ఠంగా 73,563.92 స్థాయిని నమోదు చేసింది.ఇక, నిఫ్టీ 383.70 పాయింట్లు (1.64శాతం) కోల్పోయి 23,063.10 దగ్గర ముగిసింది.
