సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనించిన ఉత్సహం నేడు, బుధవారం నీరుగారిపోయింది. నేడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 251.89 పాయింట్లు (0.34%) క్షీణించి 72,781.89 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 99.25 పాయింట్లు (0.44%) నష్టపోయి 22,622.70 వద్ద ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల వల్ల సూచీలు నష్టాలతో ముగిశాయి. ఐటీ రంగం ఊరట నిచ్చింది. : మిగతా రంగాలు నష్టాల్లో ఉన్నప్పటికీ, నిఫ్టీ ఐటీ (Nifty IT) సూచీ సుమారు 1.6% లాభపడి మార్కెట్‌కు కొంత మద్దతునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *