సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గత 3 నెలలుగా తెలుగు సినిమాకు , థియేటర్స్ కు మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. పేక్షకులను అలరించే సినిమాలతో థియేటర్స్ కళకళ లడాయి. భీమవరంలో గతంలో ఉన్న 17 థియేటర్స్ కు ప్రస్తుతం 10 మాత్రమే మిగిలి ఉన్నాయి. విష్ణు కాలేజీ క్యాంపస్ లో కూడా మరో థియేటర్ ఉంది. అది విద్యార్థులకు మాత్రమే వీకెండ్ డేస్ థియేటర్. ఇక ఇటీవల విడుదలయిన సినిమాల భీమవరం టౌన్ మొత్తం కలెక్షన్స్ .విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ హీరోగా కొరియర్ కనకరాజు 28 లక్షల కలెక్షన్ వసూళ్లు సాధించగా కిరణ్ అబ్బవరం చెన్నయి లవ్ స్టోరీ 32 లక్షల వరకు వసూళ్లు , సూర్య హీరోగా వచ్చిన విశ్వనాధం సన్స్ సినిమా 38 లక్షల వసూళ్లు , సాధించి విజయాలు సాధించగా, ఇటీవల వచ్చిన రవితేజ ఇరుముడి 1కోటి 3 లక్షల పైగా కలెక్షన్ సాధించి రవితేజ కు మొదటి కోటి రూపాయలు రెకార్డ్ గా నిలచింది. యాష్ హీరోగా టాక్సిస్ 18 లక్షలు, ఇక నాని , మోహన్ బాబు ల ‘పారడైజ్ డివైడ్’ టాక్ లో కూడా గత 20 రోజులకు సుమారు 53 లక్షల వసూళ్లు సాధించింది. ఇక కొత్త నటీనటులతో తెల్లకాగితం గత 13 రోజులకు సుమారు 11 లక్షలు , భీమవరం బ్రాండ్ శ్రీ విష్ణూ హీరోగా కామ్రేడ్ కళ్యణ్ కేవలం 5 రోజులకే సుమారు 9 లక్షల కలెక్షన్ వసూళ్లు సాధించి సినిమా థియేటర్స్ కు ప్రేక్షకులను రప్పిస్తున్నాయి. పెద్ద అంచనాలతో వచ్చిన డబ్బింగ్ సినిమాలు’హనుమాన్ అంశ’సినిమా 5 రోజులకు 3 లక్షల 33 వేలు, డొరొమేన్ సినిమా 12 రోజులకు 4 లక్షలు మాత్రమే వసూళ్లు సాధించింది. ఈ దసరా కు రణబలి, జైలర్ 2 ఫై మంచి అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *