సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ముందుగా మున్సిపల్ పోల్ కు నోటిఫికేషన్ జారీ చేసారు. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే నాలుగు కార్పోరేషన్లు.. 23 మున్సిపాల్టీలకు షెడ్యూల్ విడుదల చేయలేదు. ఇక.. నామినేషన్లకు నాలుగు రోజులే గడువు విధించటం కీలకంగా మారుతోంది. ఈ కార్పో రేషన్లు,మునిసిపాలిటీలకు ఇప్పుడు ఎన్నికలు లేనట్లే – కోర్టు కేసుల కారణంగా మిగిలిన వాటిల్లో ఎన్ని కల నిర్వహణ పెండింగ్ పెట్టినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మంగళగిరి- తాడేపల్లి, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం కార్పో రేషన్లకు ఎన్ని కలు ఇప్పు డు జరగటం లేదు. అదే విధంగా మిగిలిన 23 మున్సి పాల్టీల్లోనూ.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లి గూడెం, పాలకొల్లు, తణుకు మునిసిపాలిటీలలో విలీన గ్రామాల కోర్టు కేసుల పరిష్కారం తరువాత ఎన్నికలు జరగనున్నాయి. భీమవరంలో గత 8 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. ఈసారి జరుగుతాయి అనుకుంటే.. దీనితో ఇక్కడి రాజకీయ పార్టీలు తో స్థానిక ప్రజలు పూర్తీ నిరాశకు లోను కాక తప్పటం లేదు.
