సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం . నేడు మంగళవారం సాయంత్రానికి కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో తుఫాన్‌గా మారి రేపు బుధవారం తీవ్ర తుఫాన్‌గా బలోపేతం అయ్యి విశాఖపట్నం- బాపట్ల మధ్య కోనసీమలోని యానాం వద్ద తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.ఈ తుపాన్ గత 6 గంటలుగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిందని వాతావరణ శాఖ పేర్కొంది. పేర్కొంది. ఇది అతి తీవ్రమైన తుపానుగా కొనసాగుతూ గంటకు 115 నుంచి 125 కి.మీ వేగంతో కొన్నిసార్లు గాలి వేగం గంటకు 140 కి.మీ వరకు పెరిగే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ముసురు కమ్ముకొంది. చలిగాలుల తీవ్రత పెరిగింది. వర్షాకాలం ఎండలు పరచడం చవి చుసిన ప్రజలు ఇప్పుడు శీతాకాలం కు ఆహ్వానం పలుకుతు చలిగాలులు ను ఆస్వాదిస్తున్నారు.
