సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్ వేగంగా కదులుతోందని ప్రస్తుతానికి విశాఖపట్నానికి 580 కిలోమీటర్లు, కాకినాడకు 660 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 760 కిలోమీటర్లు, బాపట్లకు 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎల్లుండి బుధవారం కోనసీమ, కాకినాడ మధ్య యానాం తీరంలో తీరం దాటే సూచనలు ఉండటంతో గోదావరి జిల్లాలు , మరియు కృష్ణ జిల్లాలలోని పాఠశాలలకు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
