సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ‘అర్నబ్’ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ అయింది. విశాఖపట్టణం నుండి నడిచే 53రైళ్లు రద్దు చేసింది విశాఖపట్టణం – కిరండూల్ – విశాఖపట్టణం (18515-18516) నైట్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 29 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు రద్దు చేశారు. అదేవిధంగా విశాఖపట్టణం – కొరాపుట్ – విశాఖపట్టణం (58538-58537) పాసింజర్ ఈనెల 27వ తేదీ నుంచి ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేశారు. విశాఖపట్టణం – కొరాపుట్ – విశాఖపట్టణం (18512 – 18511) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఈనెల 30 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు. విశాఖపట్టణం – కిరండూల్ – విశాఖపట్టణం (58501-58502) పాసింజర్ రైలు ఈనెల 27 నుంచి ఈనెల 30వ తేదీ వరకు రద్దు చేశారు. అదేవిధంగా రాజమండ్రి – విజయవాడ, విజయవాడ – మచిలీపట్నం, మచిలీపట్నం – గుడివాడ, కాకినాడపోర్ట్ – విశాఖపట్టణం, పార్వతీపురం – విశాఖపట్టణం, 67251 – భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం,7283 – భీమవరం జంక్షన్ నుంచి నిడదవోలు జంక్షన్, 67284 – నిడదవోలు జంక్షన్ నుంచి భీమవరం జంక్షన్, 67282 – భీమవరం జంక్షన్ నుంచి విజయవాడ, ఇక భీమవరం మీదుగా వెళ్లే విజయవాడ – నరసాపురం, నరసాపురం – నిడదవోలు, తదితర రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. రైళ్లు రద్దయితే టికెట్ రీ-ఫండ్ కోసం అదనపు కౌంటర్లు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *